సిద్దిపేట జిల్లా హుస్నాబాద్(Husnabad) పట‌్టణ కేంద్రంలో గత ఐదు రోజులుగా సూపర్ స్ప్రెడర్లకు కరోనా టీకా వేస్తున్నారు. వ్యాక్సిినేషన్ కేంద్రాన్ని గురువారం స్థానిక ఎమ్మెల్యే సతీశ్ కుమార్ సందర్శించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వ్యాక్సినేషన్ నిర్వహించాలని వైద్యులకు సూచించారు.
Husnabad: ప్రజలకు ఇబ్బందులు కలగొద్దు: ఎమ్మెల్యే సతీశ్ - సిద్దిపేట జిల్లా తాజా వార్తలు
టీకా వేయించుకోవడానికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే సతీశ్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్(Husnabad)లో సూపర్ స్ప్రెడర్లకు టీకా వేసేందుకు ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్ను సందర్శించారు.
Husnabad: ప్రజలకు ఇబ్బందులు కలగొద్దు: ఎమ్మెల్యే సతీశ్
పట‌్టణంలో 2,178 మంది సూపర్ స్ప్రెడర్లను మున్సిపల్ శాఖ గుర్తించిందని, అందులో గడిచిన ఐదు రోజుల్లో 800 మందికి టీకా వేశారన్నారు. ఈనెల 16న హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలకు సంబంధించి వైద్య అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: Viral: 'ఆలూ చిప్స్'తో కర్రీ- ఇదేం వెరైటీ?