తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుంది' - husnabad mla sathish kumar

మరో 15 రోజులు రాష్ట్ర ప్రజలంతా సంయమనంతో లాక్​డౌన్​ నిబంధనలు పాటించాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్​ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో కరోనా జాగ్రత్తలు వివరించే పోస్టర్లు ఆవిష్కరించారు. కొనుగోలు కేంద్రాల్లో వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.

husnabad mla sathish inaugrated corona awareness posters
హుస్నాబాద్​లో కరోనా అవగాహన పోస్టర్ ఆవిష్కరణ

By

Published : Apr 20, 2020, 7:17 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో రాష్ట్ర రైతు రుణవిమోచన కమిటీ సభ్యుడు కవ్వ లక్ష్మారెడ్డి కరోనా జాగ్రత్తలు వివరించే స్టిక్కర్లు, పోస్టర్లు రూపొందించారు. హుస్నాబాద్​ పురపాలికలో ఎమ్మెల్యే సతీశ్ కుమార్​ ఈ పోస్టర్లు ఆవిష్కరించారు.

అనంతరం ఎల్కతుర్తికి చెందిన అరుణ చౌదరి అందించిన మాస్కులను పురపాలక సిబ్బందికి, అధికారులకు పంపిణీ చేశారు. కరోనాను కట్టడి చేయాలంటే ప్రభుత్వ నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచించారు.

కొనుగోలు కేంద్రాల్లో వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details