తెలంగాణ

telangana

ETV Bharat / state

MLA SATEESH KUMAR: ఎమ్మెల్యే సతీష్​కుమార్​ కాన్వాయ్​ అడ్డగింత - తెలంగాణ తాజా వార్తలు

హుస్నాబాద్​ ఎమ్మెల్యే సతీష్​కుమార్​ కాన్వాయ్​ను సిద్దిపేట జిల్లా అక్కన్నపేట వద్ద మైసమ్మవాగు తండావాసులు అడ్డుకున్నారు. తమ తండాకు రోడ్డు వేయాలంటూ.. ఎమ్మెల్యే ఎదుట ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులతో మాట్లాడిన ఎమ్మెల్యే నిధులు మంజూరుకాగానే.. రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని వారికి హామీ ఇచ్చారు.

MLA SATEESH KUMAR
MLA SATEESH KUMAR

By

Published : Sep 17, 2021, 7:06 PM IST

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని కుందన్​వానిపల్లి బ్రిడ్జి సమీపంలో హుస్నాబాద్​ ఎమ్మెల్యే సతీష్​కుమార్​ కాన్వాయ్​ను మైసమ్మవాగు తండా వాసులు అడ్డుకున్నారు. అక్కన్నపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్తున్న ఎమ్మెల్యేను.. తండా వాసులు అడ్డుకొని.. తమకు రహదారి సౌకర్యం కల్పించాలంటూ ఆందోళన చేపట్టారు. తండా వాసుల ఆందోళనతో వాహనం నుంచి దిగిన ఎమ్మెల్యే.. వారితో మాట్లాడారు.

మైసమ్మ వాగు తండాకు రహదారి వేసే ప్రక్రియ ప్రారంభమైనట్లు చెప్పారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగానే రోడ్డు పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే సతీష్​కుమార్​ తెలిపారు. తానే రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీతో తండావాసులు ఆందోళన విరమించారు.

MLA SATEESH KUMAR: ఎమ్మెల్యే సతీష్​కుమార్​ కాన్వాయ్​ అడ్డగింత

ఇదీచూడండి:నిందితుడు రాజు మృతిపై జ్యుడీషియల్ విచారణకు హైకోర్టు ఆదేశం

ABOUT THE AUTHOR

...view details