తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. అన్నదాతల ఆగ్రహం - husnabad farmers protest in siddipet district

ధాన్యం కొనుగోళ్లలో అధికారులు జాప్యం చేస్తున్నారని ఆగ్రహించిన రైతులు ఆందోళనకు దిగారు. రోజుల తరబడి ఎండలో పడిగాపులు కాయాల్సి వస్తోందని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో రాస్తారోకో చేశారు.

farmers protest in husnabad, farmers protest in siddipet district, delay in paddy purchase in husnabad
హుస్నాబాద్ రైతుల ఆందోళన, హుస్నాబాద్​లో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, హుస్నాబాద్​లో రైతుల ధర్నా

By

Published : May 4, 2021, 3:47 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్ డిపో పక్కన ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ, రాస్తారోకో నిర్వహించారు. పక్షం రోజులుగా ధాన్యాన్ని తీసుకొచ్చి ఆర పెడుతున్నామని, కొనుగోలు చేయడానికి ఇంతవరకు అధికారులు ఇటువైపు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతిరోజు మబ్బులు వచ్చి చుట్టుపక్కల గ్రామాల్లో వర్షాలు పడుతున్నాయని, ధాన్యం అమ్ముకోవడానికి ఎండలో ఎదురుచూస్తున్నామని రైతులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటవెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details