తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆంక్షలు లేకుండా నవరాత్రులకు అనుమతివ్వాలి: భాజపా - గణేష్ నవరాత్రుల కోసం ఏసీపీకి వినతి పత్రం

గణేష్​ నవరాత్రులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా అనుమతులు ఇవ్వాలని... సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ నాయకులు ఏసీపీకి విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం సమర్పించారు. కొవిడ్​ నిబంధనలకు అనుగుణంగా వేడుకలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

husnabad bjp leaders representation to acp for ganesh celebrations
ఆంక్షలు లేకుండా నవరాత్రులకు అనుమతివ్వాలి: భాజపా

By

Published : Aug 19, 2020, 6:46 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఏసిపి పరిధిలోని వినాయక ఉత్సవాలకు ఏలాంటి ఆంక్షలు లేకుండా అనుమతి ఇవ్వాలని కోరుతూ... భాజపా నాయకులు ఏసీపీ మహేందర్​కు వినతిపత్రం సమర్పించారు. దేశంలో ఎన్నో ఏళ్లుగా గ్రామాల్లో, పట్టణాల్లో... చిన్నా, పెద్దా తేడా లేకుండా నవరాత్రులు పూజలు నిర్వహిస్తారని... పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్​ బాబు అన్నారు. కానీ హిందువుల మనోభావాలు దెబ్బ తీసేవిధంగా కరోనాను సాకుగా చూపి వేడుకలు జరుపొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశాలు జారీ చేయడం బాధాకరమన్నారు.

కొవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా మండపాలు ఏర్పాటు చేసి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉత్సవాలు జరుపుకోవాలని సూచించాల్సింది పోయి... ఆంక్షలు విధించడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి గుత్తికొండ విద్యాసాగర్, మండల ప్రధాన కార్యదర్శి వెల్దండి సంతోష్, నాయకులు ఎగ్గోజు వెంకటేశ్వర్లు, తోట సమ్మయ్య, బోగ మహేష్కర్, కురిమెల్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details