తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనా వేళ పేదలపై విద్యుత్ బిల్లులు మోపడం సరికాదు' - Siddipet News

పెంచిన విద్యుత్​ బిల్లులు రద్దు చేయాలని, యూనిట్ బిల్లులు తగ్గించాలని సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్​ డివిజనల్​ ఇంజినీరింగ్​ విద్యుత్​ శాఖ కార్యాలయం ఎదుట భాజపా నేతలు ధర్నా చేశారు. హుస్నాబాద్​ డివిజనల్​ ఇంజినీరింగ్​ అధికారికి వినతి పత్రం సమర్పించారు.

Husnabad Bjp Leaders Protest Against Electricity Bill
విద్యుత్​ బిల్లులు రద్దు చేయాలని భాజపా ధర్నా

By

Published : Jun 15, 2020, 3:30 PM IST

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్​ డివిజనల్​ ఇంజినీరంగ్​ విద్యుత్​ శాఖ కార్యాలయం ముందు భాజపా నేతలు ధర్నా నిర్వహించారు. భాజపా రాష్ట్ర అధిష్టానం పిలుపు మేరకు లాక్​డౌన్​ సమయంలో వచ్చిన విద్యుత్​ బిల్లులు రద్దు చేసి, యూనిట్​ బిల్లులు తగ్గించాలని డిమాండ్​ చేస్తూ ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం హుస్నాబాద్​ డివిజనల్​ ఇంజినీరింగ్​ అధికారికి వినతి పత్రం సమర్పించారు.

లాక్​డౌన్​ కారణంగా మూడు నెలల బిల్లు ఒకేసారి వేయడం వల్ల స్లాబ్​ రేటు మారి.. విద్యుత్​ బిల్లులు విపరీతంగా వచ్చాయి. లాక్​డౌన్​ వల్ల ఉపాధి లేక ప్రజలు ఇబ్బంది పడుతూ.. దాతలు పంచిన సరుకులతో ప్రజలు పూట గడుపుతున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మూడు నెలల బిల్లు ఒకేసారి కట్టడం ఎంత ఇబ్బందో అధికారులు, ప్రజలు ఆలోచించాలని నేతలు హితవు పలికారు. విద్యుత్​ బిల్లులు తగ్గించకపోతే.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.

ఇదీ చూడండి :కరీంనగర్​ కమిషనరేట్​లో లైసెన్సు రద్దు సెంచరీ దాటేసింది!

ABOUT THE AUTHOR

...view details