తెలంగాణ

telangana

హుస్నాబాద్​లో అమర జవాన్లకు నివాళి

By

Published : Jun 19, 2020, 6:37 AM IST

భారత్​-చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో అమరులైన భారత జవాన్లకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో భాజపా నేతలు నివాళులర్పించారు. స్థానిక అంబేడ్కర్​ చౌరస్తాలో అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.

Husnabad BJP leaders paid tribute to Indian soldiers were killed in the clash between India and China
అమర జవాన్లకు భాజపా నేతల నివాళి

దేశ రక్షణకై అసువులు బాసిన వీర జవాన్లకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అంబేడ్కర్​ చౌరస్తా వద్ద భాజపా నేతలు కొవ్వత్తులతో ఘన నివాళులు అర్పించారు. భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో దేశానికి చెందిన 20 మంది సైనికులు వీర మరణం పొందటం బాధకరమని పేర్కొన్నారు.

తెలంగాణ ముద్దు బిడ్డ కర్నల్ సంతోష్​బాబు మరణం ఈ దేశానికి తీరని లోటని... వారి త్యాగం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలుచిపోతుందన్నారు. వారి మరణం పట్ల ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు.

ABOUT THE AUTHOR

...view details