సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంగడి బజార్లో రైతులు, వ్యాపారులు, ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించాలని ఏసీపీ మహేందర్ సూచించారు. ఈ మేరకు ఎస్సై శ్రీధర్‌తో కలిసి మాస్కులు పంపిణీ చేశారు.
మాస్కులు పంపిణీ చేసిన ఏసీపీ మహేందర్
ప్రజలు కరోనా బారినపడకుండా జాగ్రత్తలు పాటించాలని హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ పేర్కొన్నారు. అంగడి బజార్లో రైతులు, వ్యాపారులకు మాస్కులు పంపిణీ చేశారు. పట్టణంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు.
ACP Mahender distributed the masks
సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ ఆదేశానుసారం హుస్నాబాద్ డివిజన్ పరిధిలో వారం రోజులుగా కరోనా జాగ్రత్తలపై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఏసీపీ తెలిపారు. పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఎప్పటికప్పుడు చేతులను శానిటైజర్‌తో శుభ్రపరచుకోవాలన్నారు. సినిమా హాళ్లు, హోటళ్లు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, వైన్స్‌ల వద్ద గుమిగూడకూడదని చెప్పారు.