తెలంగాణ

telangana

ETV Bharat / state

సిద్దిపేట జిల్లాలో దారుణం - ఖమ్మంపల్లిలో భార్యాపిల్లలకు నిప్పంటించిన భర్త

సిద్దిపేట జిల్లాలో దారుణానికి ఒడిగట్టిన భర్త

By

Published : Nov 22, 2019, 7:49 AM IST

Updated : Nov 22, 2019, 9:19 AM IST

07:45 November 22

సిద్దిపేట జిల్లాలో దారుణానికి ఒడిగట్టిన భర్త

సిద్దిపేట జిల్లాలో దారుణానికి ఒడిగట్టిన భర్త

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లిలో దారుణం చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న భార్యా పిల్లలను సజీవ దహనం చేసేందుకు భర్త విఫల యత్నం చేశాడు.

                   ఖమ్మంపల్లిలో నివసిస్తున్నవిమల, లక్ష్మీరాజం దంపతుల మధ్య నాలుగేళ్లుగా విభేదాలున్నాయి. ఈరోజు తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న భార్య విమల, కుమార్తె, కుమారుడికి లక్ష్మీరాజం నిప్పంటించాడు. ఈ ఘటనలో విమలను చూసి వెళ్లేందుకు వచ్చిన అన్న రాజు, అక్క సునీత గాయపడ్డారు. క్షతగాత్రులకు ముందుగా సిద్దిపేట ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్​ గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Last Updated : Nov 22, 2019, 9:19 AM IST

ABOUT THE AUTHOR

...view details