komuravelli mallanna jathara: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లిలో మల్లన్న జాతర బ్రహ్మోత్సవాలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జాతర సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు సరిహద్దు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆలయ పరిసరాల్లో బోనాలు, డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా శివసత్తుల ముత్యాల నడుమ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే ఈ జాతర కోలాహలంగా సాగనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ నుంచి భారీగా..
devotees crowd in komuravelli: ఆదివారం కావడంతో స్వామివారి దర్శనం కోసం హైదరాబాద్ నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి మల్లన్నను దర్శించుకున్నారు. గొల్ల కురుమల ఆరాధ్యదైవంగా కొలుస్తున్న కొమురవెల్లి మల్లికార్జున స్వామివారిని ఒగ్గు కళాకారులు పసుపు, బియ్యం పిండితో పట్నం వేసి కొలుస్తున్నారు. ఇలా చేయడాన్ని స్వామివారి కల్యాణంగా వారు భావిస్తారు. కొమురవెల్లి పరిసరాలన్నీ ఒగ్గుడోలు, డప్పులు, శివసత్తుల నృత్యాలతో సందడిగా మారాయి. కొవిడ్ ఆంక్షలతో ఆలయ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.
భక్తులకు ఏర్పాట్లు
arrangements in mallanna temple: మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ఆలయ సిబ్బంది ముందస్తు ఏర్పాట్లు చేశారు. రేపు జరిగే చిన్న పట్నం అగ్నిగుండాల కార్యక్రమానికి భక్తులకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు తెలిపారు. అంతర్గతంగానే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
కొమురవెల్లిలో భక్తుల సందడి