సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. వేసవి తాపం నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. వాతావరణం ఒక్కసారిగా చల్ల పడటం వల్ల ఎండ వేడిమి నుంచి ప్రజలకు కాస్త ఊరట లభించింది. మండల పరిధిలోని అహ్మదీపూర్లో ఈదురు గాలుల వల్ల పలు రేకుల ఇళ్లు కూలిపోయాయి.
ఈదురుగాలులకు కూలిన ఇళ్లు... పలువురికి గాయాలు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం కురిసిన భారీ వర్షానికి ప్రజలు వేసవి తాపం నుంచి కాస్త ఉపశమనం పొందారు. పలు గ్రామాల్లో ఈదురుగాలులకు ఇళ్లు కూలిపోగా... పలువురికి గాయాలయ్యాయి.
ఈదురుగాలులకు కూలిన ఇళ్లు... పలువురికి గాయాలు
ఆ ఇళ్లలో నివాసం ఉంటున్న శంకరయ్య, బాలరాజు, భీమయ్యలకు గాయాలయ్యాయి. వీరిని స్థానిక ప్రాథమిక ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. క్షతగాత్రులను తెరాస సీనియర్ నాయకుడు మాదాసు శ్రీనివాస్ పరామర్శించి ఆర్థిక సాయం చేశారు.
ఇవీ చూడండి:తెలుగు రాష్ట్రాల్లో మూడురోజుల పాటు వర్షాలు