తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈదురుగాలులతో వడగండ్ల వాన... భారీగా పంటనష్టం - heavy rainfall in mirudoddi

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన పడింది. భారీగా కురిసిన వర్షానికి కోతకొచ్చిన వరిపంట దెబ్బతిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

heavy-rainfall-in-mirudoddi-of-siddipet-district
ఈదురుగాలులతో వడగండ్ల వాన... భారీగా పంటనష్టం

By

Published : Apr 9, 2020, 8:19 PM IST

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని పలు గ్రామాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి భారీ వర్షం కురిసింది. ఉదయమంతా భానుడి ప్రతాపంతో మండి.. ఉన్నట్టుండి ఆకాశమంతా మేఘావృతమైంది.

పలు చోట్ల ఈదురుగాలలతో కూడిన వడగండ్ల వాన కురిసింది. చేతికందిన వరి చేను కోయకుండానే అకాల వర్షానికి దెబ్బతిందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:కడుపున బిడ్డను మోస్తూ.. 142కి.మీ కాలినడక

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details