సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో అరగంట పాటు మోస్తారు వర్షం కురిసింది. నాలుగైదు రోజుల నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా... నేడు చల్లని గాలులతో కూడిన వర్షం కురవటం వల్ల ఆహ్లదకరమైన వాతావరణం నెలకొంది. పట్టణంలో చలితీవ్రత కూడా పెరిగింది.
చలికాలాన్ని పలకరించిన వర్షపు జల్లులు... - SIDDIPET WEATHER UPDATES
నాలుగైదు రోజులుగా ఎండతో వెచ్చగా మారిన వాతావరణం... నేడు కురిసిన వర్షపు జల్లులతో చల్లగా మారింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో మోస్తారు వర్షం కురిసింది.
HEAVY RAIN IN HUSNABAD CONSTITUENCY
అక్కన్నపేట చౌరస్తాలో వర్షపు నీరు నిలవగా... వాహనల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. మున్సిపల్ సిబ్బంది వర్షపు నీటిని మురుగు కాలువలోకి తరలించారు. హుస్నాబాద్‌తో పాటు నియోజకవర్గంలోని కోహెడ, చిగురుమామిడి, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లోని పలు గ్రామాల్లోనూ మోస్తారు వర్షం కురిసింది.
ఇదీ చూడండి:ఎఫ్‌డీఐలను పరిశీలించేందుకు ఓ కమిటీ!