సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, జగదేవపూర్ మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ అకాల వర్షం కారణంగా పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం మొత్తం తడిపోయింది.
ఎండుందని ఆరబోస్తే... వానొచ్చి ముంచేసింది... - FULL GRAIN IN RAIN
రోజంతా సూర్యుడి భగభగతో హీటెక్కిపోయిన వాతావరణం... సాయంత్రం కురిసిన వర్షంతో చల్లబడింది. కానీ... ఆ అకాల వర్షం రైతులను మాత్రం నిండా ముంచేసింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టుకున్న ధాన్యమంతా వర్షార్పణం కాగా... రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎండుందని ఆరబోస్తే... వానొచ్చి ముంచేసింది...
నాలుగైదు రోజుల క్రితమే కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చినా... అధికారులు కొనుగోలు చేయకపోవటం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని రైతులు వాపోయారు. అధికారుల అలసత్వం వల్లే తమ ధాన్యం నీటి పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరారు.