సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆకస్మాత్తుగా వచ్చిన వర్షం వల్ల ఆరబోసిన ధాన్యం తీసుకునే సమయం లేకపోయింది. చూస్తుండగానే తడిసి ముద్దయింది. ఈదురు గాలులకు తోడైన వర్షం కప్పి ఉంచిన టార్పాలిన్లను సైతం ఎగరేసుకుపోయింది.
చేతికొచ్చిన పంట.. వర్షార్పణం
సిద్దిపేట జిల్లాల్లో అకాలవర్షం రైతులకు తీరని నష్టం తెచ్చిపెట్టింది. సుమారు గంట పాటు కురిసిన వానకు కొనుగోలు కేంద్రాలలో ఆరబెట్టుకున్న ధాన్యం తడిసి ముద్దయింది. పంట అమ్ముకునే తరుణంలో అకాల వర్షాలు తీరని నష్టాన్ని తెచ్చిపెట్టాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
heavy rains in siddipet district
చేతికందిన పంట నోటికందే వేళ మట్టిపాలైందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తాయని చెబుతున్నప్పటికీ ధాన్యం కొనుగోలు వేగంగా జరగడం లేదని వాపోయారు. తడిచిన ధాన్యం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి:అకాలవర్షానికి నాశనమైన వరిధాన్యం.