సిద్దిపేట జిల్లాలో గత మూడునాలుగు రోజులుగా ఎండతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈతరుణంలో శనివారం ఉన్నట్టుండి ఒక్కసారిగా చల్లబడింది. మిడిదొడ్డి మండల కేంద్రంలో ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.
సిద్దిపేటలో భారీ వర్షం... అన్నదాతలు హర్షం - సిద్దిపేట జిల్లా మిడిదొడ్డిలో భారీ వర్షం
సిద్దిపేట జిల్లా మిడిదొడ్డిలో శనివారం భారీ వర్షం కురిసింది. విత్తనాలు వేసి వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కానీ పలు చోట్ల రోడ్లన్నీ జలమయమై డ్రైనేజీలు పొంగిపొర్లి వాహనాదారులకు ఇబ్బందిని కలిగించాయి.
సిద్దిపేటలో భారీ వర్షం... అన్నదాతలు హర్షం
విత్తనాలు వేసి వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం కొండంత బలాన్ని ఇచ్చింది. మిడిదొడ్డిలో కురిసిన వానకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లగా.. పలుచోట్ల విద్యుత్ వైర్లు తెగి.. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.