సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యా సరస్వతి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారికి మూల నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. లక్ష పుష్పార్చన చండీ హోమం నిర్వహించారు. శ్రావణమాసం అందులోనూ ఆదివారం కావటం వల్ల భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో ప్రజలు బారులు తీరారు. అందంగా అలంకరించి ఉన్న సరస్వతీ దేవిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
వర్గల్ సరస్వతీదేవి ఆలయంలో భక్తుల కిటకిట - HEAVY FLOW TO WARGAL TEMPLE
రెండో బాసరగా పేరుగాంచిన సిద్దిపేట జిల్లా వర్గల్ సరస్వతీ దేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాస ఆదివారం కావటం వల్ల పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
![వర్గల్ సరస్వతీదేవి ఆలయంలో భక్తుల కిటకిట](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4104682-thumbnail-3x2-ppp.jpg)
HEAVY FLOW TO WARGAL TEMPLE
TAGGED:
HEAVY FLOW TO WARGAL TEMPLE