తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ.15 కోట్లతో అందుబాటులోకి ఏఈడీ పరికరాలు: హరీశ్‌రావు - సిద్ధిపేటలో సీపీఆర్ శిక్షణా కార్యక్రమం

Harishrao on CPR Training Programme : సీపీఆర్‌ నేర్చుకుంటే గుండెపోటుకు గురయ్యే 50 శాతం మందిని బతికించవచ్చని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేటలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సీపీఆర్‌పై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2 శాతం మందికి మాత్రమే సీపీఆర్‌పై అవగాహన ఉందని.. అందరూ నేర్చుకుంటే చాలా మంచిదని తెలిపారు.

Harishrao
Harishrao

By

Published : Apr 9, 2023, 1:29 PM IST

Harishrao on CPR Training Programme : ప్రస్తుతం వయసుతో ప్రమేయం లేకుండా చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు గుండెపోటుతో మృత్యువాత పడుతున్న ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా ముమ్మరంగా సీపీఆర్ శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది. దీంతో ప్రతి జిల్లాలో సీపీఆర్ శిక్షణ కార్యక్రమాలు చేపడుతూ ప్రతి ఒక్కరికిీ అవగాహన కల్పిస్తున్నారు.

తాజాగా సిద్దిపేటలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో సీపీఆర్​పై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ శాఖ మంత్రి హరీశ్​రావు హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక పోలీస్ కన్వెన్షన్‌ హాల్‌లో ప్రజా ప్రతినిధులకు, అధికారులకు సీపీఆర్ శిక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు.. సీపీఆర్‌ నేర్చుకుంటే గుండెపోటుకు గురయ్యే 50 శాతం మందిని బతికించవచ్చని తెలిపారు. 2 శాతం మందికి మాత్రమే సీపీఆర్‌పై అవగాహన ఉందన్నారు. అందరూ సీపీఆర్ నేర్చుకుంటే ప్రతి ప్రాణాన్ని కాపాడవచ్చన్నారు. రూ.15 కోట్లతో ఏఈడీ పరికరాలు అందుబాటులోకి తీసుకురానున్నామని హరీశ్‌రావు వెల్లడించారు.

'కార్డియాక్ అరెస్టు ఎవ‌రికైనా రావొచ్చ. దానికి స‌మ‌యం, సంద‌ర్భం ఉండదు. సీపీఆర్ ప్రక్రియ ద్వారా ఆ విధంగా చ‌నిపోతున్న వారి సంఖ్యను తగ్గించవచ్చు. సీపీఆర్ నేర్చుకుంటే 50 శాతం మందిని బతికించవచ్చు. 2 శాతం మందికి మాత్రమే సీపీఆర్‌పై అవగాహన ఉంది. అందరూ సీపీఆర్‌ నేర్చుకుంటే ప్రతి ప్రాణాన్ని కాపాడొచ్చు. కార్డియాక్ అరెస్టుకు గురైన‌ వ్యక్తికి కొద్ది నిమిషాల్లో సీపీఆర్ ప్రక్రియ‌ను చేయ‌గ‌లిగితే ప్రాణాల‌ను కాపాడొచ్చు. రూ.15 కోట్లతో ఏఈడీ పరికరాలు అందుబాటులోకి తెస్తాం.' -హరీశ్‌రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి

ప్రజల విలువైన ప్రాణాలు కాపాడాలనే లక్ష్యంతోనే ఈ సీపీఆర్‌ శిక్షణ కార్యక్రమం తీసుకొచ్చామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు తెలిపారు. సీపీఆర్ ప్రక్రియ‌ను విజ‌య‌వంతం చేస్తే ప్రతి 10 మందిలో ఐదుగురిని బ‌తికించవ‌చ్చని డ‌బ్ల్యూహెచ్‌వోతో పాటు ప‌లు ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆశా కార్యకర్తలు, స్టాఫ్‌నర్సులు, సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు.. ఇతరత్రా సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. రూ.15 కోట్లతో ఏఈడీ పరికరాలను అందుబాటులోకి తెస్తామన్న ఆయన.. వాటిని జన సంచారం ఎక్కువగా ఉండే బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు వంటి ప్రాంతాల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీపీఆర్ శిక్షణ‌ను విస్తరించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయన పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details