'గాంధీ, ఉస్మానియా తరహాలో సిద్దిపేట ప్రభుత్వ వైద్యకళాశాల' - health minister attend a review meeting on siddipet government medical college
గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల తరహాలో సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల పురోగమించేలా చర్యలు చేపడతామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో సమీక్షా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి పాల్గొన్నారు.
'గాంధీ, ఉస్మానియా తరహాలో సిద్దిపేట ప్రభుత్వ వైద్యకళాశాల'
ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది కొరతను అధిగమించడానికి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేశామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నియామకాల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. వివిధ భాగాల ఉద్యోగులు సమన్వయంతో ముందుగు సాగి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలని సూచించారు. ఆరోగ్య శ్రీసేవల మెరుగు, 108 వాహనాల వినియోగం సక్రమంగా జరిగేలా చూడాలని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపిన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.
- ఇదీ చూడండి : 'పురపాలక ఎన్నికలకు రంగం సిద్ధం'