తెలంగాణ

telangana

ETV Bharat / state

"విగ్రహ పరిమాణం కాదు.. పూజలో శ్రద్ధ ముఖ్యం" - మాజీ మంత్రి హరీశ్​రావు

వినాయక చవితికి ఎంత పెద్ద విగ్రహం పెట్టామన్నది ముఖ్యం కాదని, ఎంత శ్రద్ధగా పూజలు చేశామన్నదే ముఖ్యమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. సిద్దిపేటలో 15వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు.

"విగ్రహ పరిమాణం కాదు.. పూజలో శ్రద్ధ ముఖ్యం"

By

Published : Sep 1, 2019, 4:18 PM IST

"విగ్రహ పరిమాణం కాదు.. పూజలో శ్రద్ధ ముఖ్యం"

సిద్దిపేటలో వెంకటేశ్వర అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో మాజీ మంత్రి హరీశ్​రావు 15వేల మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరు మట్టి గణపయ్యను పెట్టి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. గణేశ్​ ఉత్సవాలల్లో జరిగే పూజల్లో కూడా ప్లాస్టిక్​ను వాడొద్దని సూచించారు. వచ్చే ఏడాదికి ప్రతి ఇంటికి ఒక మట్టి విగ్రహం పంపిణీ చేస్తామని తెలిపారు. ఎంత పెద్ద విగ్రహం పెట్టామన్నది కాదు, ఎంత శ్రద్ధగా పూజలు చేశామన్నదే ముఖ్యమన్నారు.

ABOUT THE AUTHOR

...view details