తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్లక్ష్యంగా పడేసిన హరితహారం మొక్కలు - harithaharam plants for neglected in koheda

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం పలు చోట్ల అధికారుల నిర్లక్ష్యంతో నేలపాలవుతోంది. నాటడానికి తెచ్చిన సుమారు 100 మొక్కలు నిర్లక్ష్యంగా వదిలేశారు.

harithaharam, telangana
హరిత సంరక్షణేది?

By

Published : Apr 23, 2021, 4:09 PM IST

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామంలో పల్లె ప్రకృతి వనంలో స్థానిక గ్రామ పంచాయతీ నర్సరీ నుంచి నాటడానికి తెచ్చిన సుమారు 100 మొక్కలు అలాగే వదిలేశారు. దీనితో ఆ మొక్కలు పూర్తిగా ఎండిపోయాయి.

పల్లె ప్రకృతి వనంలో నాటాడానికి తెచ్చిన మొక్కలు ఇలా నిర్లక్ష్యంగా పడేయడం విమర్శలకు దారి తీస్తోంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ విధంగా నిర్లక్ష్యం చేయడం ఏంటని పలువురు చర్చించుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details