Minister Harish Rao latest comments : ఆయుష్మాన్ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం గోరంత ఇస్తే.. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం కొండంత ఇచ్చిందని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మోదీ తొమ్మిదేళ్ల పాలనపై ఇవాళ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్పై మంత్రి స్పందించారు.బీబీనగర్ ఎయిమ్స్‌కు నామమాత్రంగా నిధులు విడుదల చేసి నత్తనడకగా పనులు జరుగుతుంటే దానిని గొప్పగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రానికి రావాలసిన బకాయిలపై కేంద్రానికి లేఖలు రాసి అలసిపోయామని పేర్కొన్నారు.
ఫైనాన్స్ కమిషన్ చెప్పినా రాష్ట్రానికి ఇవ్వాల్సిన రూ.723 కోట్ల పరిహారాన్ని మూడేళ్ల నుంచి అడుగుతున్నా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఏపీ ఖాతాలోకి పొరపాటున జమ చేసిన రూ.495 కోట్లను తొమ్మిదేళ్ల నుంచి అడుగుతున్నా కేంద్రం ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు రూ.24 వేల 205కోట్ల ఇవ్వాలని నీతీఆయోగ్ సూచించినా కేంద్రం ఎందుకు స్పందించడం లేదన్నారు. విద్యుత్ మీటర్ల నిబంధనతో రాష్ట్రానికి రూ.30వేల కోట్ల నష్టాన్ని కేంద్రం ప్రభుత్వం చేసిందని ధ్వజమెత్తారు.
- BJP development works in Telangana : 'మోదీ తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణలో చేసిన అభివృద్ధి ఇదే'
- KTR Today Tweet: 'తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చిన ఘనత కేసీఆర్‌దే'
Minister Harishrao fires on central government : పన్నుల వాటా సక్రమంగా అమలు చేస్తే రూ.33వేల 712కోట్ల బకాయిలు రాష్ట్రానికి అదనంగా వచ్చేవని పేర్కొన్నారు. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన రూ.లక్ష 35 వేల 812 కోట్లను కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి అబద్దాల పుట్టను త్వరలోనే పూర్తి ఆధారాలతో పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేస్తామని హరీశ్‌రావు పేర్కొన్నారు.
Harish Rao at double bed room houses opening ceremony : అంతకు ముందు సిద్ధిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం, కావేరి సీడ్స్ భాస్కర్ రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించినడబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా మాట్లాడిన హరీశ్ రావు.. ఇవాళ పక్క రాష్ట్రాలకు అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కళ్యాణ లక్ష్మి పథకం రాష్ట్రంలో అమలవుతోందన్నారు. ఈ పథకం ద్వారా మన రాష్ట్రంలో రూ. లక్ష పదహారు వేలు ఇస్తే.. అదే గుజరాత్లో కేవలం రూ.12 వేలు మాత్రమే ఇస్తున్నారన్నారని ఎద్దేవా చేశారు.