మొట్టమొదటిసారిగా చింతమడక, మాచాపూర్, సీతారాంపల్లిలో హెల్త్ క్యాంపు నిర్వహించినట్లు హరీశ్ రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్ల చింతమడక గ్రామానికి ఓ ఆసుపత్రి యజమాన్యం కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి ఈ క్యాంప్ నిర్వహించిందన్నారు. కేసీఆర్ మాటకు కట్టుబడి ప్రజలందరికీ మంచి ఆరోగ్య సూచిక అందిస్తామని వైద్యులు తెలిపారు. అనంతరం వైద్యులను హరీశ్ రావు సన్మానించారు.
ఆరోగ్య తెలంగాణకు చింతమడక నుంచే శ్రీకారం - harishrao-at-chinthamadaka
ఆరోగ్య తెలంగాణకు సీఎం స్వగ్రామం నుంచే శ్రీకారం చుట్టనున్నట్లు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. యశోద ఆసుపత్రుల సౌజన్యంతో చింతమడకలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఆరోగ్య తెలంగాణకు చింతమడక నుంచే శ్రీకారం