తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్ పర్యటన కోసం హరీశ్ పర్యవేక్షణ - kcr

ముఖ్యమంత్రి చంద్రశేఖర్​రావు సోమవారం తన స్వగ్రామం చింతమడకలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. జిల్లా కలెక్టర్​తో కలిసి హరీశ్​ రావు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

కేసీఆర్ పర్యటన కోసం హరీశ్ పర్యవేక్షణ

By

Published : Jul 21, 2019, 8:08 AM IST

సిద్దిపేట జిల్లా చింతమడకలో సోమవారం ముఖ్యమంత్రి పర్యటనకు వారం రోజుల నుంచి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్​ వెంకట్రామిరెడ్డితో కలిసి మాజీ మంత్రి హరీశ్​ రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎంత ఉన్నతస్థాయికి ఎదిగినా... చింతమడక ప్రజలతో సీఎం అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నట్లు తెలిపారు. కేవలం గ్రామస్థులతో మమేకమయ్యేందుకే ముఖ్యమంత్రి వస్తున్నారని ఇతరులు వచ్చి ఇబ్బంది పడొద్దని సూచించారు. గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ప్రారంభోత్సవంతో పాటు గురుకుల పాఠశాలకు, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.

కేసీఆర్ పర్యటన కోసం హరీశ్ పర్యవేక్షణ

ABOUT THE AUTHOR

...view details