Harish rao Visit Renuka Ellamma Temple: సిద్దిపేట పట్టణంలోని ఐదో వార్డులో ఉన్న శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని మంత్రి హరీశ్‌రావు దర్శించుకున్నారు. ఈ మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బోనాల పండుగ ఘనంగా జరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. పండుగను పురస్కరించుకుని సాంప్రదాయ పద్ధతిలో అక్కాచెల్లెలు బోనాలు సమర్పస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని, దుష్టశక్తుల నుంచి రక్షణ కల్పించాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు. ప్రజలంతా కులమతాలకు అతీతంగా ఎంతో సంతోషంగా ఈ బోనాల పండుగను చేసుకుంటున్నారని అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా బోనాలు జరుపుకోవడం సంతోషం..: మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. పంటలు బాగా పండాలని, ప్రజలంతా సంతోషంగా, సుభిక్షంగా ఉండేలా చేయాలని అమ్మవారిని వేడుకున్నానన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అమెరికా, యూరోప్, సింగపూర్ లాంటి వివిధ దేశాల్లో ఉండే తెలంగాణ ప్రాంత వాసులు ప్రపంచ వ్యాప్తంగా బోనాలు జరుపుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. బోనాల పండుగ జరుపుతూ మన ప్రాంత, ప్రజల సంస్కృతి, సంప్రదాయం కాపాడే ప్రయత్నం జరుగుతున్నదని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.
Lal Darwaza Bonalu 2023 : లాల్‌దర్వాజలో ఘనంగా బోనాల సంబురాలు