సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కేసీఆర్ నగర్లో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. 8వ వార్డు నర్సాపూర్ కాలనీలో నాలుగో దఫా రెండు పడక గదుల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. 168 మంది లబ్ధిదారులకు నూతన వస్త్రాలిచ్చి, పట్టాలు అందించారు.
తెలంగాణ ప్రభుత్వం పేదల ఇళ్లు, పెళ్లికోసం ఆర్థిక సాయం చేస్తోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రూపాయి ఖర్చులేకుండా, చెమట చిందించకుండా నిరుపేదలకు గూడు నిర్మించి ఇస్తున్నట్లు తెలిపారు. గేటెడ్ కమ్యూనిటీ తరహాలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను గరీబోల్లకే కేటాయించినట్లు స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమాల్లో తనపై ఆరోపణలు చేసిన ఓ పార్టీ కార్యకర్తకు రెండు పడక గదుల ఇళ్లు కేటాయించారు. ఆ వ్యక్తి తనను కలిసి కృతజ్ఞతలు తెలిపాడు. 'డబుల్ బెడ్ రూం ఇళ్లకు దరఖాస్తు చేశానని.. రోజూ మీపై ఆరోపణలు చేస్తుంటానని.. ఇళ్లు కేటాయించరని అనుకున్నానని.. అయినా అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఇళ్లు కేటాయించారని' చెప్పి ధన్యవాదాలు తెలిపాడు. పారదర్శకంగా పనిచేస్తున్నామనేందుకు ఇదే నిదర్శనం.