ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందటం లేదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు (Harish Rao Paddy) ఆరోపించారు. ఎఫ్‌సీఐ (FCI) నిర్ణయాన్ని మార్చుకోవాలని మంత్రి సూచించారు. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని హరీశ్‌రావు ప్రారంభించారు.
జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోలుకు 396 కేంద్రాలు ఏర్పాటు చేశామని.. ఇప్పటికే 265 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. రెండు మూడు రోజుల్లో మిగతావి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంచామని హరీశ్‌రావు వెల్లడించారు.