Harish Rao Road Show in Dubbaka :ఓటు అంటే ఐదేళ్ల భవిష్యత్ అని బీఆర్ఎస్ పార్టీ ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. దుబ్బాకలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో బీజేపీ గెలిచింది ఒక సీటు మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో కూడా బీజేపీకి ఒక సీటు మాత్రమే వస్తుందని జోస్యం చెప్పారు. ఒక సీటు వచ్చే బీజేపీ... రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.
BRS Election Campaign in Dubbaka :బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజల సమస్యలు తీర్చలేవని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గతంలో దుబ్బాక ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు నెరవేరాయా? అని ప్రజలను అడిగారు. బీజేపీని నమ్మితే ఆగం అవుతామని ప్రజలే చెబుతున్నారని.. రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలను ఇస్తోందని అన్నారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే భూములు లాక్కుంటారని.. అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ బీఆర్ఎస్ వస్తే అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్‌ను నమ్మితే ఆగమవ్వుడు ఖాయం : హరీశ్‌రావు
"ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ప్రజలకు నమ్మకం. బీజేపీ వస్తే బోరు బావులకు మీటర్లు వస్తాయి. మీటర్లు పెట్టలేదని కేంద్రం రూ.25 వేల కోట్లు తెలంగాణకు ఇవ్వలేదు. మీటర్లు పెట్టనందునే రూ.25 వేల కోట్లు ఇవ్వలేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు ఒక్కటే. తెలంగాణలో 24 గంటల పాటు కేసీఆర్ సర్కార్ కరెంట్ ఇస్తుంటే.. కర్ణాటకలో 5 గంటలే కరెంట్ ఇస్తున్నామని డీకే శివకుమార్ చెబుతున్నారు. మీటర్లు, బిల్లు లేకుండా రైతులకు మేం 24 గంటల కరెంట్ ఇస్తున్నాం." -హరీశ్ రావు, రాష్ట్ర మంత్రి