సిద్దిపేటలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పర్యటించారు. జిల్లా గ్రంథాలయ వారోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పుస్తకం ఓ మంచి స్నేహితుడని అన్నారు. పురాతనమైన ఈ గ్రంథాలయానికి గొప్ప చరిత్ర ఉందని గుర్తుచేశారు. 2 కోట్లతో నిర్మిస్తున్న నూతన భవనాన్ని... వచ్చే మార్చి నాటికి ప్రారంభిస్తామని తెలిపారు. జిల్లాలోని 7 మండలాల్లోనూ గ్రంథాలయాలు నిర్మించనున్నట్లు తెలిపారు.
సెల్‌ఫోన్ బానిసలై... పుస్తకాన్ని మరిచిపోతున్నారు: హరీశ్‌రావు - సెల్‌ఫోన్ బానిసలై... పుస్తకాన్ని మరిచిపోతున్నారు: హరీశ్‌రావు
సిద్దిపేటలో గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లాలోని అన్ని మండలాల్లో గ్రంథాలయ భవనాలు నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు.
![సెల్‌ఫోన్ బానిసలై... పుస్తకాన్ని మరిచిపోతున్నారు: హరీశ్‌రావు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5065571-thumbnail-3x2-harish.jpg)
సెల్‌ఫోన్ బానిసలై... పుస్తకాన్ని మరిచిపోతున్నారు: హరీశ్‌రావు
సిద్దిపేట నూతన గ్రంథాలయ భవనంలో మహిళలకు, పురుషులకు, విద్యార్థులకు వేర్వేరు విభాగాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పుస్తకాల కొనుగోలుకు 40 లక్షలు మంజూరు అయినట్లు చెప్పారు. నేటి యువత సెల్‌ఫోన్ మోజులో పడి పుస్తకాలని మరిచిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
సెల్‌ఫోన్ బానిసలై... పుస్తకాన్ని మరిచిపోతున్నారు: హరీశ్‌రావు
ఇవీ చూడండి: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ విచారణ సోమవారానికి వాయిదా