ఈ నెల 10వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, జిల్లా పాలనాధికారి వెంకట్రామిరెడ్డితో కలసి ఏర్పాట్లను పరిశీలించారు. మొదటగా సిద్దిపేట శివారులో ఏర్పాటు చేయనున్న ఐటీ టవర్ ఇండస్ట్రీయల్ పార్కుకు శంకుస్థాపన ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం సిద్దిపేట-పొన్నాలలోని తెలంగాణ భవన్, సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన హరీశ్ రావు - kcr visits siddipet on december 10 latest news
సిద్దిపేటలో కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పర్యవేక్షించారు. ఈ నెల 10న ముఖ్యమంత్రి సిద్దిపేట రానున్న నేపథ్యంలో ఐటీ టవర్, ఇండస్ట్రియల్ పార్కు శంకుస్థాపన ఏర్పాట్లతోపాటు తెలంగాణ భవన్, జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించిన హరీష్ రావు
అనంతరం మిట్టపల్లి రైతు వేదిక, సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. సిద్దిపేట నెక్లెస్ రోడ్డు, కోమటి చెరువు ప్రాంగణ ఏర్పాట్ల పైనా సమీక్షించారు. నర్సాపూర్‌లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జిల్లా కలెక్టర్ వెంకట్రామి రెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్, ఇతర ప్రజాప్రతినిధులతో కలసి ఏర్పాట్లను పరిశీలించారు.