సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ విద్యాలయంలో తువ్వాలలు, నోటుపుస్తకాలు, పరీక్ష ప్యాడులు పంపిణీ చేశారు. ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే వారు పూల దండలు, బొకేలు, శాలువాలకు బదులుగా విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులు తేవాలని పిలుపునిచ్చారు. హరీశ్‌రావు పిలుపు మేరకు ఆయన వీరాభిమాని చిలుక అమృతవాణి ఇవాళ స్థానిక కస్తూర్భా గాంధీ విద్యాలయంలో వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి జి. రాములు, కస్తూర్భా గాంధీ విద్యాలయం ప్రత్యేకాధికారి నజియా సల్మా, కొమురవెల్లి ప్రత్యేకాధికారి నీరజ, ఉపాధ్యాయినులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
కస్తూర్భా గాంధీ విద్యాలయంలో వస్తువుల వితరణ - harish rao fan distributes stationary to cstudents
హరీశ్‌రావు అభిమాని అమృతవాణి చేర్యాల కస్తూర్భా గాంధీ విద్యాలయంలో తువ్వాలలు, నోటుపుస్తకాలు, పరీక్ష ప్యాడులు పంపిణీ చేశారు. హరీశ్‌రావు పిలుపు మేరకు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
కస్తూర్భా గాంధీ విద్యాలయంలో వస్తువుల వితరణ