మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలు సిద్ధిపేట కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, జడ్పీ ఛైర్మన్ రోజా శర్మ, కలెక్టర్ వెంకట్రామరెడ్డితో కలిసి ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు శత జయంతి ఉత్సవాలు ఏడాది పొడవునా జరపనున్నట్టు తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పీవీ విగ్రహాలు పెట్టాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.
పీవీ కృషితోనే ఉత్తర తెలంగాణ అభివృద్ధి: హరీశ్ - pv narasimha rao celebrations
సిద్దిపేట కలెక్టరేట్లో పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పీవీకి భారతరత్న ఇచ్చి గౌరవించాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. దేశంలో గొప్ప ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినట్టు గుర్తుచేసుకున్నారు.
కేంద్రం ప్రభుత్వం ముందుకు వచ్చి పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్లు పాలించిన ఏకైక దక్షిణాది వ్యక్తిగా కొనియాడారు. రాజకీయాలకు సంబంధం లేని మన్మోహన్ సింగ్ను ఆర్థికవేత్తగా ప్రోత్సహించి, గొప్ప సంస్కరణలకు నాంది పలికారని గుర్తు చేశారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధి పీవీ కృషితోనే జరగిందని పేర్కొన్నారు. పాలకులు, అధికారులు ఆయనను ఆదర్శంగా తీసుకొని, దేశాభివృద్ధికి పాటుపడాలని సూచించారు.
ఇదీ చూడండి:తెలుగువారి ఠీవీ- మన పీవీ: 'ఈటీవీ భారత్' అక్షర నివాళి