మట్టి గణపతిని పూజించండి.. పర్యావరణాన్ని కాపాడండి - mla
సిద్దిపేట జిల్లా మిట్టపల్లిలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మట్టి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి పాల్గొన్నారు.
మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామని సూచించారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు. మిట్టపల్లిలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో ప్రజలంతా కలిసి ఒకేఒక్క మట్టి గణేశుడి విగ్రహం పెట్టడం సంతోషకరమని గ్రామస్థులను అభినందించారు. ఒకే వినాయకుడు నినాదంతో ప్రజలు ఒక్క తాటిపైకి రావడం ఆనందంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో తొమ్మిది రోజుల పాటు యువకులు, గ్రామస్థులు కలిసి వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి.. మంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. త్రిదండి దేవనాథ జీయర్ స్వామి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి పాల్గొన్నారు.
- ఇదీ చూడండి : మన కొత్త గవర్నర్ తమిళిసై ప్రస్థానమిదీ...