అభివృద్ధి చేసే నాయకులకే పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు. జిల్లాలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ తెరాస అభ్యర్థుల తరఫున హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలు జగదేవ్‌పూర్, తీగుల్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇతర పార్టీల వారు ఒక్కరోజు ఇచ్చే డబ్బులు, మద్యం సీసాలు తీసుకొని ఓటు వేయవద్దని నాయకులు సూచించారు. గ్రామాల్లో అందుబాటులో ఉండి సేవ చేసే నాయకులను గెలిపించేందుకు కారు గుర్తుకు మరోసారి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
అభివృద్ధి చేసే నాయకులకు పట్టం కట్టండి: హరీశ్‌రావు - mla
స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లాలో ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.
తెరాసకే ఓటేయండి