ఒక దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అన్ని మతాల ప్రజలు కలిసి ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలో రంజాన్ పర్వదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసిన ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ అభివృద్ధిలో అన్ని కులాల, మతాల ప్రజలు భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అందరు కలిసుంటేనే అభివృద్ధి సాధ్యం: హరీశ్ - సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
సిద్దిపేట జిల్లా కేంద్రంలో రంజాన్ పర్వదిన వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావు పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
రంజాన్ పర్వదిన వేడుకల్లో హరీశ్‌రావు