తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థినిలతో పారిశుద్ధ్య పనులు... సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు - సోషల్​ మీడియాలో గురుకుల విద్యార్థినిల ఫొటోలు

గురుకుల పాఠశాల విద్యార్థినిలతో పాఠశాల యాజమాన్యం పారిశుద్ధ్య పనులు చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్​ మీడియాలో ప్రత్యక్షమవగా... ఈ విషయం బయటపడింది. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఈ ఘటన జరిగింది.

gurukula-students-doing-sanitation-works-in-toguta-school
విద్యార్థినిలతో పారిశుద్ధ్య పనులు... సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు

By

Published : Mar 18, 2021, 7:16 PM IST

సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని బాలికల గురుకుల పాఠశాలలో బాలికలు పారిశుద్ధ్య పనులు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతున్నాయి. మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో వారం రోజుల క్రితం సిబ్బందితో పారిశుద్ధ్య కార్మికులు గొడవ పడ్డారు. ఆ రోజు నుంచి పనులకు రావడం ఆపేశారు. కొవిడ్​ నేపథ్యంలో గురుకులలో పరిశుభ్రత అంశాన్ని విద్యార్థులే చూసుకోవాలని పాఠశాల ప్రిన్సిపాల్ ఆదేశించినట్లు తెలిసింది.

పారిశుద్ధ్య పనులు చేస్తున్న బాలికలు...
బాత్​రూంలను క్లీన్​ చేస్తూ...

పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరు కాకపోవడం, ప్రిన్సిపల్ ఆదేశాలతో విద్యార్థులే మరుగుదొడ్లతో పాటు గదులను శుభ్రం చేసుకుంటున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవగా... ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఈ విషయమై ప్రిన్సిపాల్​ను వివరణ కోరగా... కార్మికులు రాకపోవడం వల్ల మూడు రోజుల పాటు విద్యార్థులనే పారిశుద్ధ్య పనులు చూసుకోమ్మన్నట్లు తెలిపారు. ప్రస్తుతం నూతన కార్మికులను ఏర్పాటు చేశామని... పారిశుద్ధ్య పనులు కార్మికులే చేస్తున్నారని వివరించారు.

మరుగుదొడ్లు శుభ్రం చేస్తూ...
గదులు శుభ్రం చేసుకుంటున్న విద్యార్థినిలు

ఇదీ చూడండి: భైంసా గురుకుల పాఠశాలలో మరో 25 మంది విద్యార్థులకు కరోనా

ABOUT THE AUTHOR

...view details