రెక్కాడితే కానీ డొక్కాడని ఆటోవాలాల ఆకలి తీర్చేందుకు 100 రోజుల ఉపాధి కల్పించనున్నట్టు ఆర్థికమంత్రి హరీశ్ రావు అన్నారు. చిన్నకోడూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన 312 మంది ఆటో డ్రైవర్లకు సిద్దిపేటలో నిత్యావసర సరకులు అందించారు. ఆటో డ్రైవర్లకు ప్రబుత్వంఅండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.
ఆటోడ్రైవర్లకు వంద రోజుల ఉపాధి కల్పిస్తాం: హరీశ్ - ఆటోడ్రైవర్లకు హరీశ్ రావు సరకుల పంపిణీ
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలానికి చెందిన ఆటోడ్రైవర్లకు మంత్రి హరీశ్ రావు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు 100 రోజుల పని కల్పించనున్నట్టు తెలిపారు.

ఆటోడ్రైవర్లకు వంద రోజుల ఉపాధి కల్పిస్తాం: హరీశ్
ఆపదలో ఉన్న ఆటోడ్రైవర్లను ఆదుకునేందుకే నిత్యావసర సరకుల కిట్స్ అందిస్తున్నట్టు హరీశ్ పేర్కొన్నారు. కరోనా ప్రభావానికి అగ్రదేశాలు కూడా అతలాకుతలం అవుతున్నాయన్నారు. అందుకే ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్డౌన్ను పొడిగించినట్టు వివరించారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ పోలీసులు, వైద్యులకు ప్రజలు సహకరించాలని కోరారు.
ఆటోడ్రైవర్లకు వంద రోజుల ఉపాధి కల్పిస్తాం: హరీశ్
ఇదీ చూడండి:లాక్డౌన్ ముగిశాక కొత్త రూల్స్ ఇవే...