సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని రామక్కపేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం దుబ్బాక నియోజకవర్గ ప్రచార కార్యదర్శి శ్రీరాం రామకృష్ణ ప్రభు ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
కొవిడ్-19 ప్రభావంతో పని లేకుండా పస్తులు ఉంటున్న కుటుంబాలను గుర్తించి... వారికి ఆర్థిక సాయం అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇప్పటి వరకు దాతల సహకారంతో నాలుగు వందలకు పైగా పేద కుటంబాలకు చేయూతనిచ్చామని తెలిపారు.