చిన్నకోడూరు మండలం మల్లారంలో సుజల స్రవంతి నీటి శుద్ధి కేంద్ర ప్రాంగణం హరితమయంగా మారింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు (హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ) గత ఎండీ దానకిషోర్ ఈ ప్రక్రియ చేపట్టారు. ఆ సంస్థ మియవాకి ప్లాంటేషన్ విధానంలో నాటిన మొక్కలు ఏపుగా ఎదుగుతూ ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచుతున్నాయి. రాజీవ్ రహదారి పక్కనే ఉన్న ఈ ఫిల్టర్ బెడ్ ప్రాంగణం పచ్చదనానికి ఆలవాలంగా మారింది.
హరితమయం.. తాగునీటి శుద్ధికేంద్రం.. - Haritha Haram Latest. News
సిద్ధిపేట జిల్లా మల్లారంలోని సుజల స్రవంతి నీటి శుద్ధి కేంద్ర ప్రాంగణం.. హరితమయంగా మారింది. రాజీవ్ రహదారి పక్కనే ఉన్న ఈ ఫిల్టర్ బెడ్ ప్రాంగణం పచ్చదనానికి ఆలవాలంగా మారింది. దాదాపు రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో పది నెలల కిందట 18 రకాలకు సంబంధించిన 10 వేల మొక్కలు నాటారు.

సిద్ధిపేట జిల్లాలో హరితహారం
దాదాపు రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో పది నెలల కిందట 18 రకాలకు సంబంధించిన 10 వేల మొక్కలు నాటారు. వీటిలో వేప, మోదుగ, నమిలినార, రావి, మర్రి, రేల, జువ్వి, మారేడు, వెదురు, అల్లనేరెడు, చింత, బూరుగు, బాదం, ఉసిరి, కానుగ మొక్కలు ఉండటం విశేషం. ఔషధాలకు పనికొచ్చేవి, నీడ, పండ్లు ఇచ్చేవి మీటరు చొప్పున దూరంలో నాటారు. 2500 మొక్కలకు ఒక సెక్టార్ చొప్పున ఈ హరిత వనాన్ని 4 భాగాలుగా విభజించారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో మే 31 వరకు లాక్‌డౌన్ : సీఎం