సిద్దిపేట జిల్లాలోని ములుగు మండల పరిధిలోని క్షీరసాగర్ను సందర్శించారు. అనంతరం పల్లె ప్రకృతి వనం, రైతుల కల్లాల నిర్మాణ పనులను పరిశీలించారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పల్లె ప్రకృతి వనాలతో గ్రామాల్లో పచ్చదనం వెల్లివిరుస్తాయని జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రతి మొక్క సంరక్షించాలి..
నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని, వనంలో ఏర్పాటు చేసిన బెంచీలను పరిశీలించి... సంతృప్తి వ్యక్తం చేశారు. మొక్కలపై అవగహన పెంచేందుకు వనంలో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రకృతి వనం నిర్మాణ పనుల్ని మరింత సుందరీకరణ చేసేందుకు అదనంగా మరికొన్ని నిర్మాణాలను చేపట్టాలని ఎంపీడీఓ, డీఆర్డీఏ అధికారులకు సూచనలు చేశారు.