తెలంగాణ

telangana

ETV Bharat / state

'హరిత తెలంగాణలో భాగస్వామ్యం అవుదాం..' - green park opened in siddipeta

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా... సిద్దిపేటలో గ్రీన్​ పార్క్​ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ మొక్క నాటి, వాటి సంరక్షించి హరిత తెలంగాణలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

green park opened by finance minister harish rao in siddipeta
'హరిత తెలంగాణలో భాగస్వామ్యం అవుదాం..'

By

Published : Feb 18, 2020, 5:56 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ 66వ పుట్టినరోజు సందర్భంగా... సిద్దిపేట జిల్లాలో లక్షా పదివేల మొక్కలు నాటే కార్యక్రమానికి ఆర్థికమంత్రి హరీశ్ రావు శ్రీకారం చుట్టారు. సిద్దిపేట పట్టణాభివృద్ధి అథారిటీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన గ్రీన్ పార్క్​ ప్రారంభించారు. కేసీఆర్​ పుట్టినరోజున ప్రజలందరూ మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని హరీశ్ రావు అన్నారు.

రాష్ట్రాన్ని ఆకుపచ్చగా మార్చేందుకు కేసీఆర్​ కృషి చేస్తున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందింస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటి, వాటిని రక్షించుకుందామని పిలుపునిచ్చారు. ఇప్పటి నుంచి శుభకార్యాల్లో రిటర్న్ గిఫ్ట్​గా... మొక్కను ఇచ్చి హరిత తెలంగాణలో భాగస్వామ్యం అవుదామన్నారు.

'హరిత తెలంగాణలో భాగస్వామ్యం అవుదాం..'

ఇదీ చూడండి:నేడు రాష్ట్రస్థాయి పురపాలక సదస్సు

ABOUT THE AUTHOR

...view details