తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR: నాలుగు జిల్లాలకు వెటర్నరీ కళాశాలలు మంజూరు - Cm kcr siddipet tour

ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, పోలీసు కమిషనరేట్‌ భవనం, కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్​లో అధికారులతో ఆయన భేటీ అయ్యారు.

cm kcr
ముఖ్యమంత్రి కేసీఆర్

By

Published : Jun 20, 2021, 3:50 PM IST

పాలనా ఫలాలు వేగంగా ప్రజలకు అందాలనే సంస్కరణలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. సిద్దిపేట జిల్లా ప్రజలకు హృదయకపూర్వక అభినందనలు తెలియజేసిన ఆయన పాలనా సంస్కరణల్లో భాగంగా 33 జిల్లాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. మంచి ఉద్దేశంతో పాలనా సంస్కరణలు చేపట్టినట్లు స్పష్టం చేశారు.

సిద్దిపేట జిల్లాలోనే పుట్టి పెరిగా. నేను పుట్టి పెరిగిన సిద్దిపేట జిల్లాలోనే తొలి కలెక్టరేట్ సముదాయం ప్రారంభించా. తెలంగాణ ఉద్యమం కూడా సిద్దిపేట నుంచి ప్రారంభించాం. నాలుగు జిల్లాలకు వెటర్నరీ కళాశాలలు మంజూరు చేస్తున్నాం. సిద్దిపేట, వరంగల్, నిజామాబాద్, నల్గొండలో వెటర్నరీ కళాశాలలు మంజూరు చేస్తున్నాం.

-- ముఖ్యమంత్రి కేసీఆర్

సిద్దిపేటకు చాలా మంచి భవిష్యత్ ఉందని సీఎం కేసీఆర్ (CM KCR) పేర్కొన్నారు. ఇది సెంట్రల్ తెలంగాణ అని ఉద్ఘాటించారు.

ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్

ఇదీ చూడండి: CM KCR : సిద్దిపేటలో ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభించిన సీఎం

ABOUT THE AUTHOR

...view details