సిద్దిపేట జిల్లా వర్గల్‌లోని విద్యా సరస్వతి క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ఐదవ రోజు అమ్మవారు శ్రీవిద్య లలితాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. అమ్మవరి జన్మనక్షత్రం మూలా నక్షత్రం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.
శ్రీ విద్యాలలితాదేవి ఆలయంలో చిన్నారులకు విద్యాభ్యాసం - వర్గల్ శ్రీ విద్యా లలిత సరస్వతి ఆలయం
సిద్దిపేట జిల్ల వర్గల్ శ్రీ విద్యాలలితా దేవి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం సందర్బంగా ఆలయ ప్రాంగణంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.
శ్రీ విద్యాలలితాదేవి ఆలయం చిన్నారులకు విద్యాభ్యాసం
ఆలయ వ్యవస్థాపకులు చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో అమ్మవారికి తెల్లవారుజామున విశేష పంచామృతాభిషేకం నిర్వహించి శ్రీ విద్యా లలితా దేవిగా అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూలా నక్షత్రం సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లాతోపాటు హైదరాబాద్ జంట నగరాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. గురువారం సరస్వతీ మాతాగా దర్శనం ఇవ్వనున్నట్టు తెలిపారు.
ఇదీ చూడండి:సామాన్యులకు దొరకని దుర్గమ్మ దర్శనం!