విత్తనోత్పత్తికి ముందుకు వచ్చే విత్తన కంపెనీలకు ప్రజా ప్రతినిధులు, సిద్దిపేట జిల్లా యంత్రాంగం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. జిల్లాను విత్తనోత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో విత్తన కంపెనీ ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, సీడ్ కార్పొరేషన్ అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. 23 సీడ్ కంపెనీల ప్రతినిధులు కార్యక్రమానికి హాజరయ్యారు.
'విత్తన కంపెనీలకు ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తాం' - Minister harish meet with seed companies
సిద్దిపేట జిల్లాను విత్తనోత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో విత్తన కంపెనీ ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, సీడ్ కార్పొరేషన్ అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమావేశమయ్యారు. 23 సీడ్ కంపెనీల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు.
'విత్తన కంపెనీలకు ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తాం'
జిల్లాలో 5 లక్షల ఎకరాలు సాగులో ఉండగా... ప్రస్తుతం సీడ్ కార్పొరేషన్ ద్వారా 1,500 ఎకరాలు, ప్రైవేట్ విత్తన కంపెనీల ద్వారా 25 వేల ఎకరాల్లో మొక్కజొన్న, వరి, పత్తి, శనగలు, వేరు శనగ విత్తనాలు ఉత్పత్తి జరుగుతోందన్నారు. 25 సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, 3 కోల్డ్ స్టోరేజ్‌లు జిల్లాలో ఉన్నాయన్నారు. ఇటీవలే ఫామ్‌ఆయిల్ సాగుకు సైతం సిద్దిపేట జిల్లా అనుకూలమని కేంద్ర ప్రభుత్వం తేల్చిందన్నారు. డ్రిప్, ఫామ్ మెకనైజేషన్‌కు ప్రభుత్వం తరఫున సహకరిస్తామని మంత్రి తెలిపారు.