తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్ సొంత గ్రామానికి రూ.10కోట్ల ప్రత్యేక నిధులు - kcr own village

కేసీఆర్ సొంత గ్రామం చింతమడకకు రూ.10కోట్లు ప్రత్యేక నిధులు మంజూరయ్యాయి. సీఎం పర్యటన నేపథ్యంలో మంజూరు చేస్తూ ప్రణాళిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

telangana logo

By

Published : Jul 10, 2019, 3:37 PM IST

Updated : Jul 10, 2019, 11:56 PM IST

చింతమడక గ్రామానికి రూ. 10 కోట్ల నిధుల కేటాయింపు

సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామానికి పది కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు మంజూరయ్యాయి. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో గ్రామానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక నిధి నుంచి పది కోట్లు మంజూరు చేస్తూ ప్రణాళికా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ సమగ్రాభివృద్ధే ధ్యేయంగా కార్యక్రమాలు చేపట్టేందుకు త్వరలోనే తాను సొంత గ్రామం చింతమడకలో పర్యటిస్తానని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు గ్రామంలో ఒక్కో కుటుంబ స్థితిగతులు, అవసరాలపై ప్రత్యేకంగా సర్వే నిర్వహించారు.

Last Updated : Jul 10, 2019, 11:56 PM IST

ABOUT THE AUTHOR

...view details