పందులపై ఆధారపడి జీవించే తమ కులస్థులను ప్రభుత్వమే ఆదుకోవాలని తెలంగాణ ఎరుకల విద్యార్థి యువజన సంఘం కోరింది. కరోనా నేపథ్యంలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని రాజరాజేశ్వరి గార్డెన్లో నిర్వహించిన తెలంగాణ ఎరుకల విద్యార్థి యువజన సంఘం సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కెమసారం తిరుపతి వెల్లడించారు.
ప్రత్యక్షంగా... పరోక్షంగా...
తెలంగాణలో పందులపై ఆధారపడి జీవించే ఎరుకల కులస్తుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన జీఓను అమలు చేయాలని కోరారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో పందుల గైడ్ లైన్స్‌కు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. రాష్ట్రంలో రోజు రోజుకు ఎరుకల కులస్తులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా జరుగుతున్న దాడులను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
మాకు రాజకీయం.. సామాజిక గుర్తింపు లేదు