హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ కరోనా వ్యాధి బారిన పడిన విషయం విధితమే. అయితే అతను త్వరగా వ్యాధి నుంచి కోలుకోవాలని మొక్కుతూ సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామ ప్రజలు ఎల్లమ్మ దేవతకు పాలాభిషేకం చేశారు. తమ ప్రియతమ నాయకుడికి ఆయురారోగ్యాలు ప్రసాదించు తల్లీ అంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌కు కరోనా తగ్గాలంటూ ఎల్లమ్మకు పాలభిషేకం - హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ కరోనా నుంచి కోలుకోవాలంటూ ప్రజలు ఎల్లమ్మకు పూజలు
సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే సతీశ్ కుమార్ గత కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. కాగా అతని ఆరోగ్యం కుదుటపడి ఆయురారోగ్యాలతో తిరిగి వచ్చి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని గౌరవెల్లి గ్రామస్థులు ఎల్లమ్మ దేవతకు పాలభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.
ఎమ్మెల్యే కరోనా వ్యాధి బారిన పడడం వల్ల హుస్నాబాద్ నియోజకవర్గం తోపాటు పలు మండలాల్లోని చాలా అభివృద్ధి పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయని, ఆయన త్వరగా వ్యాధి నుంచి కోలుకుని ఆరోగ్యంగా, క్షేమంగా తిరిగి వచ్చి నియోజకవర్గ ప్రజలకు మరింత మెరుగైన సేవలు, అభివృద్ధి పనులు అందించాలని కోరుతూ కొబ్బరికాయలు కొట్టారు. గత కొన్ని రోజుల క్రితం కరోనా వ్యాధికి గురైన ఎమ్మెల్యే ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉండగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..