Goods Train to Gajwel : ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్‌కు నేటి నుంచి గూడ్స్ రైలు రాకపోకలు ప్రారంభం కానున్నాయి. గజ్వేల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎరువుల రేక్ పాయింట్‌కు అనుసంధానంగా ఈ రైలు సరకు రవాణా చేస్తుంది. ఈ సేవలను రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ నుంచి 12 బోగీలతో వచ్చే ఈ తొలి గూడ్స్ రైలులో 11 మెట్రిక్ టన్నుల ఎరువులు రానున్నాయని అధికారులు తెలిపారు. ఇందుకోసం గజ్వేల్ రైల్వే స్టేషన్‌లో ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు.
సీఎం ఇలాకాలో కలికితురాయి.. నేటి నుంచి గజ్వేల్‌కు గూడ్స్ బండి - Goods Train to Gajwel
Goods Train to Gajwel : సీఎం కేసీఆర్ నియోజకవర్గ కేంద్రమైన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు నేటి నుంచి గూడ్స్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. ఇందుకోసం గజ్వేల్ రైల్వే స్టేషన్‌లో ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ కృషితో రైల్వే ప్రాజెక్టు పట్టాలెక్కింది. మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి వరకు దాదాపు 151 కిలోమీటర్ల పొడవునా రూ.1160.47 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును నాలుగు విభాగాలుగా నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు మనోహరాబాద్ నుంచి గజ్వేల్ మండలం కొడకండ్ల వరకు సుమారు 43 కిలోమీటర్ల మార్గం పూర్తయింది. దక్షిణ మధ్య రైల్వే విభాగం అధికారులు ఇప్పటికే మూడు సార్లు మార్గాన్ని పరీక్షించి సమ్మతం తెలిపారు. గజ్వేల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లో ఎరువుల రేక్ పాయింట్ ఉంది. ఇందుకోసం 4 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన రెండు గిడ్డంగులను అద్దె ప్రాతిపదికన నిర్మించారు. సనత్‌నగర్, చర్లపల్లి నుంచి ఈ కొత్త లైన్‌కు అనుసంధానం చేయనున్నారు. మనోహరాబాద్-కొత్తపల్లి లైన్లను భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) గోదాములతో అనుసంధానిస్తారు.