సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ గ్రామంలో మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ పంపు హౌస్ నుంచి మంగళవారం సాయంత్రం మొదటి పంపు ద్వారా గోదావరి జలాలను బయటకు వదిలారు. ఈ అప్రోచ్ కెనాల్ ద్వారా అక్కారం పంపు హౌస్‌కు అక్కడి నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్‌కు చేరుకున్నాయి.
దుబ్బాకను ముద్దాడిన గోదావరి జలాలు - godavari river flowas at dubbaka through mallanna sagar project
సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ ప్రాజెక్టు పంపుహౌస్ నుంచి మంగళవారం సాయంత్రం వదిలిన గోదావరి జలాలు దుబ్బాక నియోజకవర్గంలో పారుతుండగా పట్టణ ప్రజలు గోదారమ్మ పరవళ్లు చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
దుబ్బాకను ముద్దాడిన గోదావరి జలాలు
దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఉన్నందున పట్టణ ప్రజలు గోదావరి జలాలను చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ లిఫ్ట్ ఇరిగేషన్ అడ్వైజర్, కాళేశ్వరం ఈఎన్సీ, మెగా కంపెనీ డైరెక్టర్, ఇంజినీర్ల బృందం తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:కరోనాను అడ్డుపెట్టుకొని 9వేల సైబర్ దాడులు