సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్, నాగ సముద్రాల గ్రామాల్లో మొహర్రం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ.. ఉత్సవాలను నిరాడంబరంగా జరుపుకున్నట్లు ఉత్సవ నిర్వాహకులు తెలిపారు.
మత సామరస్యానికి ప్రతీక... మొహర్రం వేడుక - సిద్దిపేట జిల్లాలో మొహర్రం వేడుకల వార్తలు
సిద్దిపేట జిల్లా బస్వాపూర్, నాగ సముద్రాల గ్రామాల్లో మొహర్రం వేడుకలు ఘనంగా జరిగాయి. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ.. హిందువులు, ముస్లింలు కలిసి వేడుకలను నిర్వహించారు.
హిందూ-ముస్లిం భాయి.. భాయి: ఘనంగా మొహర్రం వేడుకలు
హిందూ-ముస్లింల మత సామరస్యానికి ప్రతీకగా మొహర్రం వేడుకలు ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరిగేవి. కరోనా నేపథ్యంలో ఈసారి తక్కువ మందితోనే వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లింలు, హిందువులు కలిసి డప్పులు వాయిస్తూ పీర్లతో నృత్యాలు చేశారు. అనంతరం పీర్లకు గురకలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు.
ఇదీచూడండి.. వాట్సాప్ లంచం: జీహెచ్‌ఎంసీలో పాతికవేలిస్తే పదోన్నతి...